సైనికుల త్యాగాలకు నివాళిగా రక్తదాన శిబిరం
KDP: విజయ్ దివాస్ సందర్భంగా మన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ మంగళవారం బద్వేల్ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో హెటెరో పల్స్, మధు ల్యాబ్ సహకారంతో మాజీ సైనికులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ కార్యక్రమం ద్వారా సైనికుల సేవలకు గౌరవం తెలిపారు.