'సాంకేతిక విద్యాసంస్థలు దేశ అభివృద్ధికి వెన్నెముక'
NZB: పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యా సంస్థలు దేశ అభివృద్ధికి వెన్నెముక వంటిదని NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. శుక్రవారం పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో బాలుర, బాలికల కోసం రూ.6 కోట్లతో నిర్మించిన వసతి గృహాల ప్రారంభోత్సవంలో MLA మాట్లాడారు. వసతి గృహాలు కేవలం భవనాలు మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలని పేర్కొన్నారు.