కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: కోరం లక్ష్మి కనకయ్య
BDK: ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూతి కొమరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం కొమరయ్య దశదినకర్మలు నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మీ కనకయ్య పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.