భారత్‌కు చమురు సంక్షోభం తప్పదా!
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో చమురు సంక్షోభం భారీగా ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముడిచమురు, LPG, LNGతో నిండి ఉన్న 17 భారత నౌకలు ఇంకా హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌకలు అక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ నౌకలు ముందుకు కదలకపోతే దేశంలో చమురు నిల్వలు తగ్గి సంక్షోభం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.