'వైద్య సేవలో నిర్లక్ష్యం వద్దు'

'వైద్య సేవలో నిర్లక్ష్యం వద్దు'

NLG: గర్భిణీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ మండలం, రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైరిస్క్ ఏఎన్ సీ కేసులు, కుక్క కాటుకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఈడీడీ క్యాలెండర్, ఆసుపత్రిలో అందుబాటులో గల మందులు, మలేరియా, డెంగ్యూ పరీక్షల గురించి తెలుసుకున్నారు.