విశాఖ: నేవీ విన్యాసాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

విశాఖ: నేవీ విన్యాసాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

విశాఖపట్నంలో IFR, MILAN-2026 వేడుకల నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 19 వరకు ఆర్కే బీచ్ రోడ్డులో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాస్‌లు లేని వాహనాలకు అనుమతి లేకుండా ప్రజలు MGM, ఏయూ గ్రౌండ్స్, జడ్పీ కార్యాలయం వద్ద వాహనాలు నిలిపి కాలినడకన రావాలని, భారీ వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు ఉంటాయని తెలిపారు.