VIDEO: 'ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు ఇవ్వాలి'
ELR: రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతుకు 115 వరకు గోనె సంచులు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ ఉంగుటూరు మండలంలోని కైకరం, నారాయణపురం, చేబ్రోలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కల్లాలోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.