మౌలిక వసతులు కల్పించాలంటూ ధర్నా

KDP: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పేదల నివాసం ఉంటున్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం బద్వేలు మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.