చెన్నూరు ఆస్పత్రికి వెళ్లేదారి పరిస్థితి ఇది.!

చెన్నూరు ఆస్పత్రికి వెళ్లేదారి పరిస్థితి ఇది.!

KDP: చెన్నూరు సమీపంలో బుడ్డాయిపల్లె వద్ద ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి వెళ్లేదారి గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రికి వెళ్లే రోగులు అంబులెన్స్ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేపట్టి పూడ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.