VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మార్కెట్ ఛైర్మన్
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని నారక్క పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దండం రవీందర్ గెలుపు కోసం ఇవాళ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరారు.