భారత్ దెబ్బకు తగ్గిన పాక్ రక్షణమంత్రి

భారత్ దెబ్బకు తగ్గిన పాక్ రక్షణమంత్రి

నిన్న మొన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కొంచెం వెనక్కి తగ్గారు. పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. భారత్ తన చర్యలను నిలిపివేస్తే పాకిస్థాన్ సైన్యం కూడా కాల్పులను విరమిస్తుందని స్పష్టం చేశారు. లేదంటే తమని తాము రక్షించుకోవాలి కదా అని అన్నారు.