VIDEO: తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి: మేయర్
వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చహత్ బాజ్ పాయ్‌లతో కలిసి జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, తడి, పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వలంటీర్లు, శానిటరీ జవాన్లు, ఔత్సాహిక మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త సేకరణపై వారికి శిక్షణ ఇచ్చారు.