పదో తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో టీడీపీ సీనియర్ నేత కోదండరామిరెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈవో దిలీప్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పరీక్ష సామాగ్రిని అందజేశారు. పాఠశాలలో ఉన్న 151 మంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.