VIDEO: 'కోతుల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలి'
ADB: కోతుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామస్తులు వినూత్న రీతిలో ఆలోచన చేశారు. మనిషికి ఎలుగుబంటి వేషధారణ వేసి కోతులను తరిమేసేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ నరసమ్మ తెలిపారు. కోతులు ఇండ్లలోకి చొరబడి తిను పదార్థాలు, వస్తువులను తీసుకెళ్తున్నాయన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.