హెల్మెట్ ప్రాణ రక్షక కవచం: ఎస్ఐ
ఎన్టీఆర్: కంచికచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో ఆదివారం ఉదయం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులు హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని ఎస్ఐ నాని నరేందర్ తెలిపారు. స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షక కవచంలా పనిచేస్తుందని ఆయన సూచించారు.