డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

KMM: దళిత హక్కుల పోరాట సమితి (DHPS) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పగిళ్లపల్లి ఏసు, ఎంగలా ఆనందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన జిల్లా రెండో మహాసభలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల భూమి, రాజ్యాంగ హక్కులు, ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామని తెలిపారు.