VIDEO: ఉమ్మడి జిల్లా ప్రజలకు..WGL సైబర్ క్రైమ్ హెచ్చరిక..!
WGL: జిల్లాలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్ KYC అప్‌డేట్, అత్యవసర బుకింగ్ పేరుతో వాట్సాప్, SMSల ద్వారా నకిలీ లింకులు పంపి డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, గ్యాస్ సంబంధిత అవసరాలకు ఏజెన్సీలను సంప్రదించాలని తెలిపారు.