నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
మెదక్ జిల్లా హవేలీఘన్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ సంబంధించి పలు అంశాలపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్ పాల్గొన్నారు.