ఉచిత ప్రయాణం కోల్పోతున్న సరిహద్దు మహిళలు

ఉచిత ప్రయాణం కోల్పోతున్న సరిహద్దు మహిళలు

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దు మండలాలైన ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, రామగిరి పరిధిలో 84 బస్సులు కర్ణాటక వైపు నడుస్తున్నాయి. స్త్రీశక్తి పథకం ఈ రూట్లలో అమలు కాకపోవడంతో మహిళలు ఉచిత ప్రయాణానికి నోచుకోలేకపోతున్నారు. అందరికీ సమానంగా ఈ సౌకర్యం కల్పించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.