రంజాన్.. కట్టుదిట్టమైన భద్రత

రంజాన్.. కట్టుదిట్టమైన భద్రత

కడప జిల్లాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ముస్లిం సోదరులకు పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.