పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
KMM: కూసుమంచి మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి సక్రమంగా అందిందా అని ఆయన ఆరా తీశారు. పోలింగ్ సమయంలో, కౌంటింగ్ సమయంలో తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.