తగ్గిన కూరగాయల ధరలు
NGKL: కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో నాలుగు రోజులతో పోలిస్తే ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు రూ.50 ఉన్న టమాటా ధర నేడు కిలో రూ.30 కి పడిపోయింది.బెండకాయ,చిక్కుడుకాయ,గోరుచిక్కుడు ధరలు కిలో రూ.60 కి చేరాయి.పచ్చిమిర్చి,దోసకాయ, వంకాయ ధరలు రూ.40 నుంచి రూ.50 మధ్య కొనసాగుతున్నాయి.అయితే,ఆకుకూరల ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు.