కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఉద్యమం

SRD: కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. సంగారెడ్డి లోని కేబుల్ కిషన్ భవన్లో కార్మికుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు మల్లేశం పాల్గొన్నారు.