VIDEO: అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం
MDK: మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అంగరంగ వైభవంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం పురస్కరించుకొని 10 గంటలకు విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.