శ్రీవారికి రూ.1.50 లక్షల ఆభరణాలు సమర్పణ

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంకలో కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారికి ఉప్పుగంటి శ్రీధర్, కుమార్ లక్ష్మి దంపతులు రూ. 1.50 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను శుక్రవారం సమర్పించారు. స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని వీటిని ఆలయ కమిటీకి అందజేశారు. బంగారు ఆభరణాలకు సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు అలంకరించారు.