'లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి'

'లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి'

SRCL: జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని దరఖాస్తులు ఆన్‌లైన్ చేశారో పీడిని అడిగి తెలుసుకున్నారు.