ఏపీకి మరో తుఫాన్ ముప్పు
VSP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇది నేడు బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిస్తాయి.