పేదల సొంతింటి ముచ్చట.. సందడి చేసిన కాంగ్రెస్ నేతలు!
KNR: రామడుగు మండలం గోపాల్‌రావుపేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ దాసరి రాజమణి కనుకయ్య ఇంటి గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి హాజరై, గృహ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటి ప్రవేశం ఆనందదాయకమైన ఘట్టమని తెలిపారు.