VIDEO: హత్నూరలో రాజకీయ వేడి.. బీజేపీ నిరసన

VIDEO: హత్నూరలో రాజకీయ వేడి.. బీజేపీ నిరసన

SRD: హత్నూర మండలంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మండల అధ్యక్షుడు నాగ ప్రభు గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.