BREAKING: ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.