ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం

ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం

SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సూర్యాపేట నుంచి కోదాడ వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.