అమెరికా నుంచి భారీగా చమురు దిగుమతులు

అమెరికా నుంచి భారీగా చమురు దిగుమతులు

అమెరికా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకున్నట్లు కెప్లర్ గణాంకాలు వెల్లడించింది. అక్టోబరులో రోజుకు 5,68,000 బ్యారెళ్ల చమురును అగ్రరాజ్యం నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా నుంచి ఈ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం 2021 మార్చి తర్వాత మళ్లీ ఇప్పుడేనని చెప్పింది. అయినప్పటికీ భారత ముడిచమురు దిగుమతుల్లో 34 శాతం వాటాతో రష్యా అగ్ర స్థానంలో కొనసాగుతోందని పేర్కొంది.