VIDEO: ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్రతం నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.