ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి సీఎం సహాయని చెప్పులను పంపిణీ చేశారు. మొత్తం తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.5,85,823 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు CMRF నిధులతో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు.