VIDEO: తోటపల్లి బ్యారేజీకి వరద ఉద్ధృతి

PPM: ఒడిశాలో పడుతున్న వర్షాలకు తోటపల్లి బ్యారేజీకి నాగావళి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు 4వ గేటు పైకెత్తి అదనపు వరద నీరు దిగువకు విడిచి పెట్టినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు ఆదివారం తెలిపారు. ఎగువ నుంచి 6,468 క్యూసెక్కుల వరద నీరు రాగా రిజర్వాయర్లో 1.963 TMCల నీటి సామర్థ్యానికి పెరిగిందన్నారు.