కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు
నారాయణపేటలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు ఉన్నాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను వెల్లడించారు. శనివారం నారాయణపేటలోని ఈవిఎం గోడౌన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోడౌన్‌కు వేసిన శ్రీలను చెక్ చేశామని తెలిపారు. పోలీసు బంధువస్తులు గమనించి వారికి పలు సూచనలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.