వైద్య సేవల నియామక బోర్డుకు స్వయం ప్రతిపత్తి
AP: రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్-2018 రెండో షెడ్యూలును సవరిస్తూ అటానమస్ ఆర్గనైజేషన్ జాబితాలో ఏపీ వైద్యసేవల నియామక బోర్డును చేర్చింది. దీంతో వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో APPSC పరిధిలో లేని రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి పోస్టుల భర్తీని వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.