VIDEO: వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
MDK: వెల్దుర్తి మండల కేంద్రంలోని వెల్దుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం RBSK వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధానంగా గైనిక్ సమస్యలపై పరీక్ష నిర్వహించి, డైట్ తీసుకునే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చేసిన వైద్య పరీక్షలను అడిగి తెలుసుకున్నారు.