రొంపిచర్లలో శ్రామికుల మస్టర్ వెరిఫికేషన్ చేసిన పీడీ
PLD: రొంపిచర్ల గ్రామ పంచాయతీలో ఫీడర్ చానల్ పనులను పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి పరిశీలించారు. ఉపాధి హామీ, శ్రామికుల మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించి, ఎన్‌ఎంఎంఎస్ అటెండెన్స్‌ను స్వయంగా పంపించారు. పనుల్లో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.