VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SKLM: భావితరాలకు సాధించుకున్న స్వతంత్ర ఫలాలను అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరానికి స్వచ్ఛమైన పాలనతో పాటు అభివృద్ధి ఫలాలు అందే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.