రేపు జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

VSP: జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.