రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన లారీ

రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన లారీ

W.G: కాళ్ల నుంచి ఆకివీడు వెళ్లే రోడ్డు ఆధ్వానంగా మారిందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఉండి రైల్వే గేటు మూసివేయడంతో భీమవరం వెళ్లే వాహనాల రాకపోకలు ఈ మార్గంలో అధికమయ్యాయి. కోలనపల్లి పరిధిలో ఆర్&బీ రహదారిపై ఏర్పడిన మోకాలు లోతు గుంతలలో చేపల లోడుతో వెళ్తున్న లారీ పడి, సంపు పగిలిపోయి ఆగిపోయింది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.