'సునీత విలియమ్స్‌కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి'

'సునీత విలియమ్స్‌కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి'

SKLM: 9 నెలలు అంతరిక్షంలో గడిపి సునీతా విలియమ్స్‌ భూమిపైకి విజయవంతంగా చేరిన సందర్భంగా ఆమెకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయం నుండి బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యోమగామిగా అంతరిక్ష అన్వేషణలో ఆమె చేసిన కృషి యువతకు ఆదర్శం అన్నారు. మహిళల దైర్యాన్ని ఆమె నిరూపించారన్నారు.