భారత్ తొలి మిస్ ఇండియా ఇక లేరు
భారతదేశపు తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల కాస్టెలినో తుదిశ్వాస విడిచారు. ముంబైలో జన్మించిన మెహర్, 1964లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 1973లో ఈవ్స్ వీక్లీలో తొలి కథనంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారు.