దళిత నేతలతో ఆత్మీయ సమావేశం

ATP: నగరంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నియోజకవర్గ దళిత నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శింగనమల నియోజకవర్గంలో దళితులు పడుతున్న ఇబ్బందులు వారి కష్టాలు తెలుసుకున్నారు. దళిత నాయకులకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.