VIDEO: భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
WGL: జిల్లాలో ప్రసిద్ధ గాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇవాళ కార్తీకమాసం చతుర్దశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తిమాయ వాతావరణం నెలకొంది.