'మద్యం షాపు తొలగించాలి'

'మద్యం షాపు తొలగించాలి'

SKLM: పాతపట్నం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న మద్యం దుకాణం వద్ద పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానికులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపును తక్షణం తొలగించాలని అధికారులను కోరారు. మహిళలు, పిల్లలు, విద్యార్థులు రద్దీగా ఉండే జనవాసాల మధ్య ఈ షాప్ పెట్టడం తగదన్నారు. అధికారులు వెంటనే మద్యం షాపును తొలగించాలన్నారు.