వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
KDP: వేముల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(39) అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తొండూరు మండలానికి చెందిన వ్యక్తితో ఆమెకు 2023లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం పాలు కావడంతో ఆరేళ్ల నుంచి తండ్రి వద్ద ఉంటుంది. గత నెల 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.