నాలుగు రోజులపాటు బోథ్ మార్కెట్ బంద్
ADB: బోథ్ AMC మార్కెట్‌లో సోయ, మొక్కజొన్న పంట నిలువలు అధిక మొత్తంలో నిల్వ ఉండడంతో ఈ నెల 5వ తేదీ నుంచి 08వ తేదీ వరకు మార్కెట్ యార్డులో పంటల కొనుగోలు నిలిపివేస్తున్నామని సెంటర్ ఇంచార్జి స్వామి పేర్కొన్నారు. తిరిగి 9వ తేదీ నుంచి యథావిధిగా పంటలు కొనుగోలు చేయబడుతాయని రైతు సోదరులు సహకరించగలరని కోరారు.