'బాలికల సంరక్షణ అందరి బాధ్యత'
ELR: నూజివీడు పట్టణంలోని కోనేరు పేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డీ.వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు.